కిడ్నీలో రాళ్లను పిండి చేసే..పిండి కూర ఆకు.. మరీ… వాడితే డేంజరే..

-

కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు ఉంటే ఆపరేషన్‌ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి డైట్‌ ఫాలో అయితే చాలు. అయితే కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ప్రకృతి మనకు చాలా అందించింది. అందులో ఒకటి.. పిండి కూర ఆకు. మనం పల్లెటూళ్లలో చాలాసార్లు చూశాం. దీనిని పాషాణభేది అని కూడా అంటారు. అంటే రాళ్లను సైతం కరిగిస్తుందని దీని అర్థం. కొండపిండి చెట్టు అని, తెలగ పిండి చెట్టు అని కూడా అంటుంటారు..ఈ పిండి కూర మన ఇంటి ముందు, మన పెరట్లో, చెలకల్లో అంతటా కనిపిస్తుంది. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలకు రేగు పండ్లు, నవ ధాన్యాలతోపాటు ఈ పిండి కూర రెక్కలను కూడా అలంకరిస్తారు.

kidney-stones

ఈ పిండి కూర ఆకులు పిడికెడు తీసుకుని పరిగడుపున మూడు రోజులపాటు తీసుకుంటే చాలు.. కిడ్నీలు రాళ్లు క్రమంగా కరిగిపోతాయి. అంత శక్తిమంతమైన ఔషధ గుణం ఉన్న ఆకు ఇది.

పిండికూర ఔషధం.. ఉపయోగించే విధానం..
పిండి కూర మొక్కను వేర్లతో సహా బాగా కడిగి దానిని తురిమి అర లీటరు నీటిలో మరగబెట్టాలి. అలా దీనిలో సగం వరకు ఆవిరైపోయే వరకూ మరిగించాలి. అప్పుడు దీనిని దించి వడబోసుకోవాలి. దీనికి పటిక బెల్లం ఒక 30 గ్రాములు, శిలాజిత్ పొడి ఒక 2 గ్రాములు కలుపుకోవాలి. ఇలా ప్రతిరోజూ పరగడపున.. అంటే ఖాళీకడుపుతో తాగాలి. తాగిన తరువాత గంట సేపు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. మూత్రాశయంలో, మూత్ర పిండాల(కిడ్నీ)లో ఉన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా వెళ్లిపోతాయి.

పిండి కూర మొక్కలు వేర్లతో సహా తెచ్చి బాగా కడిగి మెత్తగా దంచాలి. ఒక ముద్దలాగా చేసి ఒక గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. సమపాళ్లలో పటిక బెల్లం కలపాలి. ఇప్పుడు దీనిని సన్నని మంటపై మరిగించాలి. లేతగా పాకం వచ్చే వరకూ మరిగించండి.. ఆ తరువాత చల్లార్చి నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని పెద్దవాళ్లయితే రోజుకు ఒకటి రెండు చెంచాలు, పిల్లలైతే అర చెంచా రోజూ తీసుకుంటే మూత్రపిండాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

పిండి కూర ఆకును కూరగా వండుకొని తినవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. తద్వారా మూత్రపిండాల్లో ఉన్న వ్యర్థాలు మూత్రం ద్వారా వెల్లిపోతాయి. పిండి కూర వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు. తేయాకు పొడికి బదులుగా దీనిని వేసుకుని టీ చేసుకుని తాగొచ్చు. తద్వారా మూత్రాశయ సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయి. చపాతీ పిండిలో కూడా ఈ ఆకు వేసుకుని చేసుకోవచ్చు.

అయితే దీనికి మోతాదుకు మించి తినకూడదు.. అసలు ఏ సమస్యా లేకపోతే రెగ్యులర్‌గా తినొద్దు..ఇది ఎముకలను సైతం పిండి చేస్తుంది. కాబట్టి.. జాగ్రత్తే.!!

Read more RELATED
Recommended to you

Latest news