హైదరాబాద్ మహానగరంలో ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి వచ్చిన నేపథ్యంలో… హైదరాబాద్ మహా నగరాన్ని ప్రజలందరూ వదిలి తమ గ్రామాలకు వెళ్లారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉద్యోగం చేసేవారు వర్క్ ఫ్రం హోం… కారణంగా తమ స్వగ్రామాలకు వెళ్లి తమ ఉద్యోగాన్ని నిర్వర్తించారు. దీంతో హైదరాబాద్ లో ఇండ్లకు కిరాయిలు తగ్గిపోయాయి. హైదరాబాద్ పూర్తిగా ఖాళీ అయినట్లే అందరికీ అనిపించింది.
అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ నగరంలో ఇండ్ల ధరలు కూడా పెరిగిపోయాయని ఓ సర్వే సంస్థ పేర్కొంది.దీనికి తోడు నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో ఆయా నగరాల్లో ఇల్ల ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్లో 8 శాతం వరకు పెరిగినట్లు క్రేడాయి సర్వేలో తేలింది. ఇక ఢిల్లీలో పది శాతం, కోల్కత్తాలో 12 శాతం, పూణేలో 9% బెంగళూరులో ఎన్ని శాతం చెప్పిన ధరలు అదనంగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్ కు రూ.92,66 పలుకుతున్నట్లు వెల్లడించారు.