గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు… మరోసారి ఆసుపత్రికి వెళ్ళనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో యశోద ఆసుపత్రికి చంద్రశేఖర రావు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. ఇవాళ మళ్లీ యశోద ఆసుపత్రికి వెళ్ళబోతున్నారు.

దీంతో గులాబీ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. హెల్త్ చెకప్ కోసం మరోసారి ఆసుపత్రికి కేసీఆర్ వెళ్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆసుపత్రికి మరోసారి కేసీఆర్ వెళుతున్న నేపథ్యంలో… ఆయనకు మళ్ళీ అనారోగ్యం అంటూ వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.