(అ)సమర్ధుడైన కొడుకు అందొస్తున్నవేళ… పార్టీ భవిష్యత్తు?

-

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! ఈ విషయం ఇప్పుడు చినబాబు చంద్రబాబులకు ఆపాదిస్తున్నారు అభిమానులు! ఇంతకాలం “అందొస్తాడనుకున్న కొడుకు అసమర్ధుడిగా మిగిలిపోయాడు” అని చంద్రబాబు లోలోపల కుమిలిపోతున్నారనే కామెంట్లు తమ్ముళ్ల నుంచే వినిపించేవి! అయితే… ఇప్పుడు బాబు భారం చినబాబు దించుతున్నారని అంటున్నారు తమ్ముళ్లు!

అవును… టీడీపీకి మంచిరోజులు వచ్చాయో లేదో కాలం నిర్ణయిస్తుంది కానీ.. ప్రస్తుతానికి ఈ వయసులో కాస్త రెస్ట్ తీసుకుని రిటైర్మెంట్ లైఫ్ ని అనుభవించడానికి, మనవడితో ఆడుకోవడానికి చంద్రబాబు కు మాత్రం కాస్త మంచిరోజులు వచ్చాయని అంటున్నారు తమ్ముళ్లు! అవును… ఇంతకాలం భాగ్యనగరంలో గదిలో కూర్చుని ట్విట్టర్ ని మాత్రమే నమ్ముకుని చిల్లర కామెంట్లు చేస్తూ రాజకీయం చేసిన చినబాబు… ఇకపై రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట!

అందులో భాగంగానే… అనంతపురంలో జేసీ సోదరులను పరామర్శించేందుకు వెళ్లినా.. శ్రీకాకుళంలో అచ్చెన్న ఇంటికి వెళ్లినా.. తాజాగా అమరావతి ఉద్యమం 300వ రోజు సందర్భంగ ఆ నాలుగు గ్రామాల్లో పర్యటించినా.. తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు నియమించిన మహిళా ఇంచార్జ్ లు, ప్రధాన కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవం సోలోగా నిర్వహించినా… అదే కారణం అని అంటున్నారు!

దీంతో చంద్రబాబు కూడా కాస్త హ్యాపీ ఫీలయ్యారని అంటున్నారు! మరీ అసమర్ధుడిగా మిగిలిపోతాడేమో అనుకున్న దశలో, ఇలా కాస్త జనాల్లోకి రావడం, యాక్టివ్ గా ఉండటంతో బాబుకు పుత్రోత్సాహం మొదలవుతుందని అంటున్నారట తమ్ముళ్లు! అయితే.. “మందలగిరి” విషయంలో చినబాబు ఫెర్మర్మెన్స్ చూసినవారు మాత్రం… ఈ దెబ్బతో పార్టీ సంగతి తాడో పేడో తేలిపోతుందని అంటున్నారట! మరి చినబాబు ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతుందో చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news