తన ప్రేయసి కోసం కొత్త కార్ గిఫ్ట్ ఇచ్చిన జబర్దస్త్ నూకరాజు..!!

-

బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ నూకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నూకరాజు ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ జబర్దస్త్ లో కూడా అవకాశాన్ని అందుకున్నారు. అలా చలాకి చంటి టీమ్ లో చేరి ఆ తర్వాత జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలోనే కాకుండా ఇతర వారిలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక నూకరాజు కూడా ఎన్నోసార్లు తమ కుటుంబం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొందని తెలియజేయడం జరిగింది.

ఇన్ని రోజులు ఇతర టీంలో చేసిన నూకరాజు ఇప్పుడు ప్రస్తుతం నాన్ స్టాప్ నూకరాజు అనే టీం పేరుతో జబర్దస్త్ స్కిట్ చేయబోతున్నట్లు సమాచారం. నూకరాజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పటాస్ ద్వారా పరిచయమైన ఆసియాతో ప్రేమలో పడ్డాడు. ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో మాట్లాడుతూ మొదటిసారి ఆసియా నూకరాజుకి లవ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తాజాగా నూకరాజు, ఆసియా కు ఒక సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆసియాకు, నూకరాజు ఖరీదైన ఒక కారును గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. రోజు బైక్ పై తిరగడం కష్టంగా ఉందని ఆసియా కోసమే కారు కోన్నట్లుగా తెలియజేశారు. నూకరాజు, ఆసియా కోసం తీసుకున్న కారు పేరు కియా సెల్ టాస్. ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్లో సుమారుగా రూ.14 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక నూకరాజు తన కారు కొన్న వీడియోని స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లోనే పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీరికి సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news