వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి బెనిఫిట్ అయింది. టీడీపీ-జనసేనలకు నష్టం జరిగింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి టీడీపీ-జనసేన లు ఈ సారి కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. దీని వల్ల వైసీపీకి రిస్క్ ఉంటుందనే ప్రచారం ఉంది. ఓ వైపు పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ చెబుతుంది గాని..లోపల మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నట్లే తెలుస్తోంది.
ఇదే సమయంలో పొత్తులపై జగన్ స్పందించారు..తాజాగా పల్నాడు జిల్లా సభలో పాల్గొన్న జగన్…చంద్రబాబు-పవన్ లపై విరుచుకుపడ్డారు. వెన్నుపోటు దారులకు, మీ బిడ్డ జగన్‌కు మధ్య యుద్దం జరుగుతుంద ని, మీ బిడ్డకు పొత్తులు ఉండవని, ఒంటరిగా సింహంలా పోరాడతాడని తెలిపారు. అంటే ఆయనకే ఆయనే సింహం అని చెప్పుకుంటూనే..పొత్తుల వల్ల తమకు నష్టమేమీ లేదని పరోక్షంగా చెప్పినట్లు కనిపిస్తుంది.
కానీ ఇక్కడ పరోక్షంగా ఆ వ్యాఖ్యలు గమనిస్తే..అటు చంద్రబాబు-పవన్ కలిసి వస్తున్నారని, తాను ఒంటరి అని, ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చి..మళ్ళీ లబ్ది పొందాలనే దిశగా జగన్ స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే పొత్తు వల్ల ఎంతో కొంత నష్టం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆ నష్టం జరగకుండా సెంటిమెంట్ తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది. అంటే తాను ఒంటరిని అని చెప్పి ప్రజల్లో సింపతీ లేపడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే రాజకీయాల్లో ఎవరి స్కెచ్ వారికి ఉంటుంది..ఎవరు ఏమి చెప్పిన…ప్రజలు ఎవరి వైపు మద్ధతు ఉంటారనేది ఎన్నికల సమయంలో తేలుతుంది. ఇక జగన్‌ని జనం సింహం అనుకుంటున్నారా? బాబు-పవన్‌ని తోడేళ్లు అనుకుంటున్నారా అనే విషయం ఎన్నికల సమయంలోనే తేలుతుంది.