దత్త తండ్రి చెబితే..దత్త పుత్రుడు చెప్పులు చూపిస్తున్నాడు – సీఎం జగన్‌

-

దత్త తండ్రి చెబితే..దత్త పుత్రుడు చెప్పులు చూపిస్తున్నాడని పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబులకు సీఎం జగన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. వీళ్లు బూతులు తిట్టడంలో ఏ స్థాయికి వెళ్ళారో చూస్తున్నామని.. టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తుంటే వీళ్ళా నాయకులు అని బాధేస్తుందని ఆగ్రహించారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నాడో చూస్తున్నామని.. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని మనం ఆలోచిస్తుంటే.. కొంత మంది మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

మీరూ చేసుకోండి అని చెబుతుంటే ఆలోచన చేయండని.. మూడేళ్లో, నాలుగేళ్ళు కలిసి ఉండి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోండి అంటున్నారన్నారు. వ్యవస్థ ఇలా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ మాన, ప్రాణాలు ఏం కావాలి?? అని ఆగ్రహించారు. కలిసి కూటములు కట్టి మన ప్రభుత్వం పై యుద్ధం చేస్తారంట వీళ్ళంత అని.. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంత మంది ఏకం అవుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుందని ఎద్దేవా చేశారు. మంచి చేసే ప్రభుత్వానికి, పచ్చరంగు పెత్తందార్లకు మధ్య పోరాటం అని.. వచ్చే 18 నెలలు రోజూ ఇవే కనిపిస్తాయని పేర్కొన్నారు. ప్రజలంతా నాకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం ఉందని.. నేను దత్త పుత్రుడిని, మీడియాను నమ్ముకోలేదని తెలిపారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news