ఇళ్ల పట్టాల పంపిణీ పై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఏది కావాలో తేల్చుకోండి !

-

ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  డిసెంబరు 25న డి–ఫామ్‌ ఇస్తూ, ఇంటి స్థలం పట్టాలు ఇస్తామని అన్నారు. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. అదే రోజు 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా  మొదలు పెడతానని అన్నారు. ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు. పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు కానీ ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తామన్న ఆయన దేవుడు మనకు అండగా ఉంటారని అన్నారు.

కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లో ఇస్తామన్న ఆయన  ఆ మేరకు 1.20 లక్షల మందికి కొత్తగా జాబితాలో చేర్చామని అన్నారు. దానిలో 80 వేల మందికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందని అన్నారు. బాబు స్కీమ్‌ ప్రకరం లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలని, ఆ తర్వాత ఇంటి పై హక్కులు వారి చేతికి వస్తాయని, అప్పుడే ఆ ఇంటి పట్టా వారికందుతుందని అన్నారు. జగన్‌ స్కీమ్ ప్రకారం  కేవలం ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌,అనంతరం  ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు వస్తుందని అన్నారు. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఈ వివరాలు చెప్పి, వారికి ఏ స్కీమ్‌ కావాలన్నది తెలుసుకోండని అధికారులను ఆదేశించారు. జగన్‌ స్కీమ్‌ కావాలనుకున్న వారికి  డిసెంబరు 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తమని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news