పోలవరం విషయంలో వాళ్ళ నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న పోరాట స్ఫూర్తి సీఎం జగన్ లో కనిపించడం లేదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగనామాలు పెట్టిన వ్యక్తిగా జగన్ మిగిలిపోయేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వీరుడు, సూరుడు అనుకున్న జగన్.. కేంద్రం దగ్గర మోకరిల్లుతున్నాడని విమర్శించారు.
ఇక వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సిపిఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన, సిపిఐ కలిసే పోటీ చేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పొత్తు కుదిరితే తమ ఓటు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని స్పష్టం చేశారు.