సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన ప్రారంభంలో వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఇంట్లోనే దుండగులు హత్య చేయడం జరిగింది. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ఇది కావాలని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన హత్య అని సిబిఐ చేత విచారణ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి జగన్ ముఖ్యమంత్రి అవడం జరిగింది.
దీంతో జగన్ అధికారంలోకి రావడంతో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారని అందరూ భావించారు. అయితే కేవలం సిట్ మాత్రమే వేయడం జరిగింది గతంలోనూ చంద్రబాబు హయాంలో సిట్ చేతనే విచారణ చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అదనపు సిట్ బ్రిటన్ జరిగింది. కాగా కేసుకు సంబంధించి విచారణ నత్తనడకన సాగుతున్న తరుణంలో వివేక కుమార్ కే సునీత ఈ కేసులో తనకు చాలా అనుమానాలు ఉన్నాయని అంటూ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినా జగన్ సిబిఐ విచారణ వద్దనే అంటున్నారు.
తాజాగా ఆయన తాను వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకుంటా అని, దానిని పరిగణలోకి తీసుకోవద్దని, ఈ కేసులో సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పడం విశేషం. జగన్ పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి కోర్టు ఒప్పుకుంటే వివేక కుమార్తె, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పిటిషన్లు మాత్రం సజీవంగానే ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్ కి అంత భయం ఎందుకు..? సీబీఐ దర్యాప్తు చేస్తే మీ బాగోతం అంతా బయట పడుతుంది అంటూ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.