సూపర్ స్టార్ తో గోల్డెన్ ఛాన్స్ ..ఎలా వచ్చిందో తెలుసా ..?

-

బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ ఎంత హాట్ టాపిక్ అయ్యాడో అందరికీ తెలిసిందే. సింగర్ గా ఉన్నప్పుడు ఇంతగా పాపులర్ అవలేదు. కాని బిగ్‌బాస్ సీజన్ 3 కి వచ్చాక మాత్రం ఈ కుర్ర సింగర్ విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇందుకు కారణం ఒకరకంగా మరో హాట్ కంటెస్టెంట్ పునర్నవి అని కూడా చెప్పాలి. ఆ క్రేజ్ తో రాహుల్‌కు కృష్ణవంశీ మంచి అవకాశమిచ్చాడు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా ఆయన తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో రాహుల్ లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు.

 

ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ – రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇదే రాహుల్‌ ని ఆనందంలో ముంచెత్తుతుందంటే ఇప్పుడు మరో గోల్డెన్ ఛాన్స్ ని అందుకున్నాడు రాహుల్. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో బంపరాఫర్ తగిలింది రాహుల్ కి. బంపరాఫర్ అంటే సింగర్ గా అని అందరూ అనుకుంటున్నారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో రాజుల్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. అయితే అసలు రజనీ సినిమాలో రాహుల్ కి ఛాన్స్ వచ్చే ఛాన్సే లేదే …! ఎలా వచ్చింది అని అందరు ఆరా తీస్తున్నారట.

శివ దర్శకత్వంలో రజనీకాంత్, మీనా, ఖుష్బూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఫేమసయిన కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించడానికి రాహుల్ సిప్లిగంజ్‌‌ నటించబోతున్నట్లుగా తాజా సమాచారం. మరి ఇది ఇంకా అధికారకంగా బయటకు రానప్పటికి ఇది నిజం అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news