మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

-

ఏపీ ప్రభుత్వం జనాలకు వరుస గుడ్ న్యూసులు చెబుతుంది.. ఒకవైపు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతల్లో వ్యతిరేకత కొనసాగుతున్నా కూడా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు మహిళా ఉద్యోగులకు మరో గుడ్ న్యూసు ను చెప్పారు. మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను తమ సర్వీస్‌ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు..

టీచర్స్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా.. దాన్ని వెంటనే పరిశీలించి సంబందించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఆదే విధంగా.. ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్‌ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ నిర్ణయం ఇప్పుడు మహిళా ఉద్యోగులకు సంతోషాన్ని ఇస్తుంది.. అంతేకాదు మహిళా అభివృద్ధి కోసం మరిన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు..

Read more RELATED
Recommended to you

Latest news