జగన్ అంటేనే ఒక బ్రాండ్ – ఒక జోష్ అని కొనియాడారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. కేవలం జగన్ పై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్ లో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పర్యాటక రంగంలోనే 22 వేల కోట్ల పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి అని, గత ప్రభుత్వం మాదిరి నామమాత్రపు ఒప్పందాలు కాదన్నారు.
ప్రతి ఒప్పందాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్తామని తెలిపారు. విశాఖ గ్లోబల్ సమ్మేట్ తర్వాత అన్ని దేశాలు ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తాయన్నారు. తిరుపతిని టెంపుల్ టూరిజం గా, విశాఖను ప్రకృతి టూరిజం గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా వైజాగ్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.