గ్రామ పంచాయతీలకు జగన్ మరో షాక్.. !

-

గ్రామ పంచాయతీలకు జగన్ మరో షాక్ ఇచ్చింది. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు తదితర కారణాలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్తు చార్జీలపై విధించిన సర్ చార్జీలు గుదిబండలా తయారయ్యాయి.

రూ.2,208 కోట్ల విద్యుత్తు బకాయిలపై రూ.1,434 కోట్ల సర్ చార్జీలను విద్యుత్తు పంపిణీ సంస్థలు విధించాయి. కేంద్రం కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రూ. 1,351కోట్లు మళ్ళించింది.

2021-22 లో రెండో విడతగా విడుదల చేసిన మరో రూ.948 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సిఎఫ్ఎంఎస్ కి అనుసంధానించిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ పీడీ ఖాతాల్లో జమ చేసింది వీటిని కూడా చెల్లించాలని పంచాయతీలకు విద్యుత్తు పంపిణీ సంస్థలు నోటీసులు ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news