కడప స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వైయస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం జగన్ ఇవాళ శంకస్థాపన చేయనున్నారు. 8,800 కోట్ల వ్యయంతో 30 లక్షల టన్నుల వార్షిక ఉ త్పత్తి సామర్థ్యంతో జెఎస్డబ్ల్యు గ్రూప్ దీన్ని ఏర్పాటు చేయనుంది. తొలి దశలో రూ.3,300 కోట్లు వెచ్చించనుంది. ప్లాం ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పి స్తుంది.
ఇందులో భాగంగానే, విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి కడప ఎయిర్ పోర్టు కు అక్కడ నుంచి హెలీక్యాప్టర్ లో భూమి పూజ వద్దకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం పులివెందులలో జరిగే ఓ పన్షన్ కు హాజరు కానున్న సిఎం జగన్ మోహన్ రెడ్డి.. తిరిగి కడప నుంచి గన్నవరం వెళ్లనున్నారు. ఇక సిఎం జగన్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.