ఏపీ ఆదాయాలు పడిపోయాయి..పరిస్థితి దారుణంగా ఉంది : సీఎం జగన్

-

కాసేపటి క్రితమే.. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితులు ఈమారిదిగా ఉండకపోయి ఉంటే… మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి.. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచామని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈచర్చలు జరిగాయన్నారు. మీరు లేకపోతే నేను లేనని.. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నానని పేర్కొన్నారు. ఇది మీ వల్లే సాధ్యపడుతోందని.. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండని వెల్లడించారు. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండని.. రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నామన్నారు.

అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నామని… వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటానన్నారు. ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తానని.. ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటన చేశారు. భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నామని.. అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తానని సీఎం జగన్‌ స్పస్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news