ఇవాళ టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. అయితే… ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసిందే. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా… మొదట బౌలింగ్ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 1000వ వన్డే కానుంది.
ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్(w), కీరన్ పొలార్డ్(c), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, అకేల్ హోసేన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్