రాజకీయాల్లో వైయస్ జగన్ కి క్రెడిబిలిటీ ఉంటుందని ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పే రకం కాదని చాలామంది జగన్ స్నేహితులు మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెబుతుంటారు. అంతే కాకుండా తన స్పీచ్ లో కూడా ప్రజల మధ్య హామీల ఇచ్చే విషయంలో ఒక్కసారి మాట ఇస్తే ” మడమ తిప్పను ” అని చాలాసార్లు జగన్ తెలపడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని “మడమ తిప్పను” అని జగన్ అంటున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లోని ఉంచాలని వికేంద్రీకరణ బిల్లులు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో..పెద్దలు సలహాలు ఇవ్వాల్సిన తరుణంలో ప్రజల చేత ఎన్నుకోబడిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆమోదించిన బిల్లును శాసనమండలిలో పెద్దలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు జగన్. అంతేకాకుండా శాసన మండలి అనేది ఒక రాజకీయ వేదిక గా మారిందని ….శాసనమండలినే ఇటీవల అసెంబ్లీలో రద్దుచేసి…శాసన మండలి రద్దు బిల్లును పార్లమెంటు సెక్రెటరీ కి జగన్ పంపించడం జరిగింది.
దీంతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఇక శాసన మండలి రద్దు అవ్వదని..ఈ బిల్లును అడ్డంపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కార్ ని ఆడుకోవటం గ్యారెంటీ అని ఇటీవల కామెంట్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా జగన్ సర్కార్ మూడు రాజధానులలో ఒక రాజధానిగా ఎంపిక చేసిన విశాఖలో ప్రభుత్వానికి సంబంధించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని తరలించి అక్కడి నుండే పరిపాలన మొదలు పెట్టాలని ఆలోచన చేసినట్లు దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలించడానికి రెడీ అయినట్లు సమాచారం.