ప‌వ‌న్ – క్రిష్ టైటిల్‌పై కొత్త ట్విస్ట్‌..!

-

రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ సినిమాలను దూరంపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ జ‌న‌సేన ఘోరంగా ఓడిపోవ‌డంతో ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్న‌ట్టే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వ‌చ్చే నాలుగేళ్ల వ‌ర‌కు ప‌వ‌న్ రాజ‌కీయంగా చేయ‌డానికి ఏం ఉండేది లేదు. ఓ వైపు టీడీపీ, మ‌రోవైపు బీజేపీ ఏపీలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షాలు ఎదిగేందుకు ర‌క‌ర‌కాల స్కెచ్‌లు వేస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప‌వ‌న్ జ‌న‌సేన‌కు ఉన్న ఒకే ఒక్క సీటుతో ఏదేదో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడ‌ని ప‌వ‌న్‌కే న‌మ్మ‌కం లేన‌ట్టు ఉంది.

ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చి మరో మూడు నాలుగు సినిమాలు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ గతంలోనే ముగ్గురు, న‌లుగురు నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్స్‌లు తీసుకున్న‌ది నిజం. అందుకే ఇప్పుడు క‌నీసం ముందుగా ఆ ప్రాజెక్టులు అయినా పూర్తి చేద్దామ‌ని చూస్తున్నాడ‌ట‌. ఇక ప‌వ‌న్ గ‌తంలో స‌త్యాగ్ర‌హి అనే ప్రాజెక్టును ప్రారంభించి మ‌ధ్య‌లోనే ఆపేశాడు.

ఇప్పుడు ఈ సినిమా టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. పవన్ హీరోగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై 2006లో ఏఎం.ర‌త్నం నిర్మాణంలో ప్రారంభ‌మైన ఈ సినిమా కొద్ది రోజుల షూటింగ్ అనంత‌రం ఆగిపోయింది.  సామాజిక సమస్యలపై ఓ యువకుడి పోరాటంగా సాగే ఆ కథ అప్పట్లో పవన్ కి బాగా నచ్చిందట. ప్ర‌స్తుతం ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉన్నందున ఆ క‌థ ప‌వ‌న్ రాజ‌కీయ జీవితానికి బాగా యూజ్ అవుతుంద‌ని తాను భావిస్తున్నాడ‌ట‌.

క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ప‌వ‌న్ ఉన్నాడ‌ట‌. ఏఎం.ర‌త్నం నిర్మాణంలో ఈ సినిమా అప్ప‌ట్లో తెర‌కెక్కినందున ( ప‌వ‌న్‌కు గ‌తంలోనే ర‌త్నం అడ్వాన్స్ ఇచ్చి ఉన్న నేప‌థ్యంలో ) ఇప్పుడు కూడా ర‌త్నం నిర్మాణంలో అదే బ్యాన‌ర్‌పై ఈ సినిమా కంటిన్యూ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news