ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల అమ్మఒడి పథకానికి రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని బట్టి నోబెల్ గ్రహీత ఒకరు సీఎం జగన్ లీడర్షిప్ క్వాలిటీస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అని ఆ నోబెల్ గ్రహీత వీడియో రూపంలో తమ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో నిరుద్యోగులను మరియు అదే విధంగా చదువుకుంటున్న విద్యార్థుల పై ఎక్కువ దృష్టి సారిస్తూ పరిపాలిస్తున్న జగన్ ఇటీవల అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా పాలిటెక్నిక్ మరియు డిగ్రీ అదేవిధంగా ఐటిఐ చదువుతున్న విద్యార్థులకు కూడా తన ప్రభుత్వ తరఫున సంక్షేమం అందాలని జగన్ అన్న వసతి దీవెన పథకం కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయలు అలాగే ఐటీఐ విద్యార్థులకు 10 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనుంది.
అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలలో రెండు విడతలుగా ఈ నగదు జమ కానుంది. దాదాపు 11.60 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ నుండి రాష్ట్రంలో ఈ పథకం అమలు కానుంది. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ఈ పథకాన్ని జగన్ ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో చాలామంది కాలేజీ విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రకటించిన జగనన్న వసతి దీవెన పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ జగన్ అన్న అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.