దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. ఆ ఆలయంలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధో మనకు తెలసు. ఏటా నిర్వహించే ఈ ఆలయ రథోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథస్వామి ఆలయ నిర్మాణం కోసం ఒడిశాకు చెందిన ప్రవాస భారతీయుడు రూ.250 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. యూకేలో స్థిరపడిన బిశ్వనాథ్ పట్నాయక్ లండన్ శివారులో జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణం కోసం భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. బిశ్వనాథ్ ఫిన్ నెస్ట్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్.
కాగా, లండన్ శివారులో దాదాపు 15 ఏకరాల్లో ఈ టెంపుల్ నిర్మించనున్నారు. 2024 చివరి నాటికి ఆలయం తొలి విడత నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ఎస్‌జేఎస్‌యూకే ప్రణాళిక రచిస్తోంది. ఈ ఆలయం యూరప్‌లో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని శ్రీ జగన్నాథ సొసైటీ యూకే చైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్ అన్నారు. వేలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన ఎన్నికల ప్రచార సమయంలోనూ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
Trustees of SJSUK @Sahadevswain @drprakashdey2 @ItsMeBhakta @sukant74 & Jagannatha bhakts thrilled; With support of @cnribnp @arunkar06 #ShreeJagannathaMandirLondon will soon become a reality! 🙏@narendramodi @PMOIndia @CMO_Odisha @Naveen_Odisha @dpradhanbjp @achyuta_samanta pic.twitter.com/YsXT7Ee7aS
— Shree Jagannatha Society UK (@JagannathaUK) April 25, 2023