వార్డు మెంబర్ కు కూడా పనికి రాడు.. బచ్చగాడు : బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్

-

బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యాడు. రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా..తప్పు లేదు నీకు అంటూ సుమన్ పై ఫైర్ అయ్యాడు. బాల్క సుమన్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు… కెసిఆర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపితే మంచిదని చురకలు అంటించారు. కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి రాజకీయంగా మేము లాభం పొందినమా..? లాభం పొందింది మీరు అని అగ్రహించారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

రిజర్వేష్లు రాలేదు..రుణమాఫీ కాలే.. ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు..వీటికి సమాధానం చెప్పాలి కెసిఆర్ అని నిలదీశాడు. రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు..లేకుంటే వార్డ్ నెంబర్ కు కూడా పనికి రాడని.. అంత దమ్ముందా ? అని సుమన్ కి సవాల్ విసిరారు.

నీ బతుకు ఎంతా..నువెంత.. రాహుల్ గాంధీ నీ క్షమాపణ చెప్పాలనీ అంటావా..? నువ్వు ఒక్కసారి ఓడిపోతే… కనుమరుగై పోతావని నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ మీద ఇంకో సారి మాట్లాడితే ఊరుకోనని.. పోలీసులు ఉంటే బతికి పోతా అనుకుంటున్నావు…? మా nsui.. యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెంటపడితే తిరగలేవని వార్నింగ్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో.. ఎవడో ఒకడు వచ్చి ఒళ్ళు పగలకొడతాడని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news