రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..”జైలర్” నుంచి బిగ్ అప్డేట్

-

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రతీ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తమిళ్ తలైవా నటించిన సినిమాలను జనాలు చూస్తుంటారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఫిల్మ్ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తు్న్న 169వ సినిమా ఇది.

ఈ ఫిల్మ్ ..డెఫినెట్ గా అభిమానుల అంచనాలను అందుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాలో నటించేందుకుగాను రజినీకాంత్‌ రూ.148 కోట్లకు పైన పారితోషికం ఇచ్చారని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు రజినీకాంత్‌ లుక్‌ ను కూడా విడుదల చేసింది. ఇందులో రజినీ చాలా క్లాసిక్‌ లుక్‌ లో కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news