ఎడిట్ నోట్: షా…తారక మంత్రం..!

-

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే…అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం సత్తా చాటింది…రాజమౌళి దర్శకత్వంపై, ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల నటనకు ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి…ఎన్టీఆర్-చరణ్‌లని అభినందిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం క్రేజ్ తగ్గలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా సైతం..ఎన్టీఆర్‌ని కలిసి అభినందించారు.

సరే సినిమా పరంగా అభినందలు వరకే వారి భేటీ పరిమితమైంది అంటే…ఆ అంశం ఎవరికి నమ్మశక్యంగా లేదు. సినిమాలో నటన బాగుంటే ఫోన్ చేసి అభినందించవచ్చు. ఎంతో బిజీగా ఉండే కేంద్ర మంత్రి స్వయంగా ఎన్టీఆర్‌ని కలవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. సరే సినిమా వరకే అనుకుంటే రాజమౌళి, రామ్ చరణ్‌లని కూడా ఆహ్వానిస్తే వేరుగా ఉండేది…కేవలం ఎన్టీఆర్‌ని ఆహ్వానించడంపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు వస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న తారక్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. పైగా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ గత కొంతకాలంగా నడుస్తోంది…ఇలాంటి తరుణంలో అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ కావడం అనేది బాగా హాట్ టాపిక్ అయింది. ఓ వైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కష్టపడుతుంది. టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేసి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.

తెలంగాణలో అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ ముందుకెళుతుంది…ఈ క్రమంలో తమ బలం మరింత పెంచుకునే దిశగా బీజేపీ పనిచేస్తుంది…ఇలాంటి తరుణంలోనే ఎన్టీఆర్‌తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎలాగో బీజేపీకి పవన్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక సినిమాల పరంగానే కాకుండా..రాజకీయాల పరంగా కూడా అదిరిపోయే క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ మద్ధతు కూడా దక్కితే బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

చెప్పాలంటే తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు..అందుకే ఎన్టీఆర్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా అమిత్ షా భేటీ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. అటు ఏపీలో బీజేపీ బలం లేదు…పవన్ తో పొత్తులో ఉన్నారు. అయినా సరే బీజేపీకి ఆదరణ పెరగడం లేదు. అయితే ఎన్టీఆర్‌ని ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేయాలని అనుకుంటుందని అంటున్నారు.

మొత్తానికైతే ఎన్టీఆర్ ద్వారా రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ పొందడమే బీజేపీ లక్ష్యమని, అందుకే అమిత్ షా సైతం ప్రత్యేకంగా ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో ఎవరికి క్లారిటీ లేదు. అమిత్ షా లాంటి వారే ఎన్టీఆర్‌తో భేటీ అయిన నేపథ్యంలో..చంద్రబాబు సైతం…ఎన్టీఆర్‌ని దగ్గర చేసుకోవాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే షా…తారక మంత్రం రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news