హుజూరాబాద్ గడ్డపై రాజకీయాలు గమ్మత్తుగా తయారయ్యాయి. కొందరు టీఆర్ ఎస్ వైపు ఉంటే.. మరి కొందరు ఈటలవైపు ఉంటామని జై కొడుతున్నారు. కలిసి తిరిగిన వారే రెండుగా విడిపోతున్నారు. ఇక్కడ మరీ గమ్మతేందంటే.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ టీఆర్ ఎస్ వెంట నడుస్తామంటే.. వైస్ చైర్ పర్సన్ ఏమో ఈటలకు జై కొడుతున్నారు.
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ల పల్లి రాజేశ్వర్‌రావు మొన్న మంత్రి గంగులను కలిశారు. ఆయన వెంట 8మంత్రి కౌన్సిలర్లు ఉన్నారు. గంగులను కలిసిన తర్వాత టీఆర్ ఎస్ వెంటే ఉంటామని తేల్చి చెప్పారు. ఈటలపై విమర్శలు చేశారు.
ఈ మీటింగ్ తర్వాత వైస్ చైర్ పర్సన్ దేసిని స్వప్న 13మంది కౌన్సిలర్లతో ప్రెస్‌మీట్ పెట్టి తాము ఈటల వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా ఈటలనే తమ నాయకుడని చెప్పారు. దీంతో చైర్మన్, వైస్ చైర్ పర్సన్ రెండు విడిపోయారు. మరి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తితే ఏం చేస్తారో చూడాలి. అయితే ఇక్కడ ఈటలకు సపోర్టు చేస్తున్న వారంతా టీఆర్ ఎస్‌లోనే ఉంటారా లేదా అనేది చూడాలి.