జమ్మూ కాశ్మీర్ లో ఈ ఏడాది 133 మంది ఉగ్రవాదుల హతం.

-

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రోజుకో ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. కొన్నాళ్లు సద్దుమనిగిన ఉగ్రవాదం కార్యకలాపాలు ప్రస్తుతం మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో కొత్తగా హైబ్రిడ్ టెర్రరిజంతో దాడులు చేస్తున్నారు. స్థానికేతరులైన వారిని కాల్చి చంపుతున్నారు. అయితే ఇలా దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను వెతికిమరీ మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. తాజాగా ఈరోజు కుల్గాంలో జరిగిన ఎన్ కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో 133 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టనట్లు కాశ్మీర్ ఇన్స్పెక్టర్  జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ హిజ్బుల్ ముజాహీద్దిన్, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకమయ్యాయి. ఈనేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎన్ఐఏ విస్త్రుతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో వరసగా స్థానికేతరులను ఉగ్రవాదులను చంపేశారు. ఈ క్రమంలోనే కేంద్రహెం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ ను సందర్శించి ఉగ్రవాదులను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి భద్రతా బలగాలకు దిశా నిర్ధేశం చేశారు. దీని ఫలితంగానే ఇటీవల కాలంలో వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల్ని హతమొందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news