అడివి శేషు ” మేజర్” సినిమా నుంచి “జన గణ మన” సాంగ్ రిలీజ్

-

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేషు. క్షణం, గూడచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడవిశేష్ ఇప్పుడు “మేజర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.” గూడచారి” ఫెమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయను న్నారు. మేజర్ జీవితం లోని వివిధ దశలను తెర పై ఆవిష్కరించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి జనగణమన సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ లో దేశ భక్తి ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. కాగా “మేజర్” రేపు విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news