‘కారు’లో 40 సీట్లు ఔట్..డ్యామేజ్ తప్పదా?

-

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊహించని విధంగా మారుతున్నాయి..అసలు ఎప్పుడు ఏ పార్టీ లీడ్ లోకి వస్తుందో…ఏ పార్టీ బాగా జోష్ లో ఉంటుందో..ఏ పార్టీ ఉన్నపళంగా డల్ అయిపోతుందో అర్ధం కావడం లేదు..ఒక ఏడాది క్రితం వరకు అయితే అధికార టీఆర్ఎస్ హవానే కనిపించింది. కానీ ఎప్పుడైతే బీజేపీ రేసులోకి వచ్చిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. అటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ కూడా దూకుడుగా రాజకీయం చేస్తుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది.

అయితే ఆ రెండు పార్టీలకు ఎలాగైనా చెక్ పెట్టి మూడో సారి అధికారం దక్కించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు…ఇక ఎప్పటిలాగానే తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. రేసులో ముందున్న బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ రాజకీయం కనబడుతుంది..అలాగే పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చూస్తున్నారు. బీజేపీపై పోరు ఎలా ఉన్నా…ముందు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ వీక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది.

వాస్తవానికి కేసీఆర్‌ నాయకత్వంపై, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో కాస్త సానుకూలత కనిపిస్తుందనే చెప్పొచ్చు. కానీ కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.  ఎమ్మెల్యేగా ఉంటూ పనులు చేయకుండా పెత్తనం చేయడం, పనితీరు బాగా లేకపోవడం,  కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలు, దందాలు లాంటి ఆరోపణలని ఎదుర్కోవడం బాగా మైనస్ అవుతుంది.

ఓవరాల్ గా చూస్తే 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత  ఎదుర్కొంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది. అందుకే అలాంటి వారికి అధిష్ఠానం టిక్కెట్‌ను నిరాకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పుడే పార్టీ సేఫ్ అయ్యి మళ్ళీ గెలవడానికి ఛాన్స్ ఉంటుందని అర్ధమవుతుంది….లేదంటే కారుకు డ్యామేజ్ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news