ఏపీ బీజేపీ నేతల మీద తీవ్రంగా ఫైర్ అయిన నడ్డా ?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఏపీ బీజేపీ నాయకత్వం వ్యవహార శైలిపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం నాడు నాయుడుపేట సభలో పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉప ఎన్నికలో విజయానికి రాష్ట్ర నేతలు అనుసరిస్తున్న వ్యూహాలు మీద ఏమాత్రం సంతృప్తి చెందలేదని సమాచారం.

jp-nadda
jp-nadda

బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని జాతీయ నాయకత్వం చెబుతున్నా.. రాష్ట్ర నాయకులు పట్టించుకోలేదు. కార్యకర్తలతో  సరిగా సమన్వయం చేసుకోకుండా అస్తవ్యస్తంగా వదిలేయడంతో నడ్డా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని నడ్డా ఆక్షేపించారని అంటున్నారు. ఇక ఇక్కడ వైసీపీ అభ్యర్ది గెలుపు ఖాయం, ఆయన మెజారిటీ తగ్గించి ఆ వోట్లు బీజేపీ సాధించాలని ముందు నుంచి భావించింది.కానీ అవేవీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.