ఇదేందయ్యా ఇది..పెళ్లి జంట మెడలో ‘జనసేన’ కండువా !

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు పవన్‌ కళ్యాణ్‌.

అయితే, తాజాగా ఓ పెళ్లి జంట కూడా పవన్ పై, ఆయన పెట్టిన జనసేన పార్టీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికి చాలా తతంగం ఉంటుంది. పంతులు చెప్పిన విధంగా చేస్తూ, ఇద్దరు ఒక్కటవుతారు. మెడలో పూలదండలు వేసుకొని అందంగా తయారవుతారు. అయితే ఏపీలో ఓ పెళ్లి జంట మాత్రం వినూత్నంగా ఒక్కటయింది. పెళ్లి సమయంలో జనసేన పార్టీ కండువాను మెడలో వేసుకొని ఆ జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news