వారసుల ఎంట్రీ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన రవితేజ..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తర్వాత రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో నాని, విజయ్ దేవరకొండ వంటి వారు కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని రాణిస్తున్నారు. అయితే వీరంతా కూడా మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా వుండగా రవితేజ ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ గురించి ఎక్కువగా తన సినిమాల్లో కామెంట్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే . తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈయన చెబుతున్న డైలాగ్స్ కూడా వారసులను అనుసారంగా వస్తున్నాయని.. ఇండస్ట్రీలోని వారసులకు ఎక్కడో తగులుతున్నాయి అని కూడా గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ చెప్పిన రవితేజ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ధమాకా సినిమాలో కూడా మరొకసారి వారసులను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాతో అయినా ఆయన అన్ని ప్లాప్ లను మరిచిపోయేలా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో రవితేజకు జోడిగా పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీలా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ధమాకా నుంచి వచ్చిన డైలాగు విషయానికి వస్తే..” వెనుకున్న వాళ్లను చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురా. వెనుకెవడూ లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ” అంటూ ఈయన చెప్పిన డైలాగు తగలాల్సిన వారికి ఎక్కడో తగిలినట్టు ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా వరుసగా వారసులపై సెటైర్స్ వేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు రవితేజ..

Read more RELATED
Recommended to you

Latest news