NTR30 పై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్..!!

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం తన 30 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ హీరోయిన్ల ఎంపిక విషయంలో కొంచెం తడబాటు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు కొంతమంది హీరోయిన్ లని అనుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి కోరిక మేరకు ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోందని ప్రచారం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. కానీ ఇందులో నిజం లేదు అంటూ ఆమె తాజాగా ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించడం గమనార్హం.

తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తాను ఎన్టీఆర్ 30వ సినిమాలో నటించడం లేదు అంటూ వెల్లడించింది. ముఖ్యంగా సౌత్ మూలం సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఎన్టీఆర్ సార్ తో కలిసి పని చేయడం చాలా గొప్ప విషయమని ఆమె వెల్లడించింది. అంతేకాదు అతను ఒక లెజెండ్.. కానీ దురదృష్టం వల్లే ఆఫర్ ఇంకా నాకు రాలేదు. నేను ఇంకా వేచి ఉన్నాను.. నేను ఒక ఉత్తమమైన వాటి కోసం ఆశిస్తున్నాను అంటూ వెల్లడించింది. అంతేకాదు తమిళ్ చిత్ర పరిశ్రమలో నటించడంపై కూడా మాట్లాడిన.. జాన్వీ.. క్లాసిక్ మణి సర్ సినిమాల తరహాలో సినిమా చేయడం చాలా ఇష్టమని, ఐశ్వర్యరాయ్ చాలా సాధారణ దుస్తులతో.. బ్యాగ్రౌండ్ రెహమాన్ పాట ప్లే చేస్తున్నట్లు అంతటి అద్భుతమైన సినిమాలు తనకు కూడా కావాలని చెప్పింది.NTR30: Jr NTR-Koratala Siva film's motion poster out- Cinema express

ఇకపోతే గుడ్ లక్ జెర్రీ సినిమా పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధంగా ఉంటూనే మరొకవైపు వరుణ్ ధావన్ తో కలిసి.. బవాల్ కోసం యూరప్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ 30 వ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాదని స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news