ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరో అన్న జాన్వీ

బాలీవుడ్ స్టార్ మరియు శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో కథానాయికగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పటినుంచో తెలుగులో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్ 30 వ సినిమా రూపంలో బంగారం లాంటి ఒక అవకాశం దక్కింది. దీని గురించి జాన్వీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానని వ్యక్తపరిచింది జాన్వీ కపూర్.

Janhvi Kapoor on sensational headlines about her: 'There was a phase when I  felt cheated…' | Entertainment News,The Indian Express

చిత్రీకరణ ఎప్పుడు మొదలుపెడతారు అంటూ రోజూ డైరెక్టర్ కు మెసేజులు పంపుతున్నానని తెలిపింది. ఎన్టీఆర్ తనకు చాల ఇష్టమైన హీరో అని, ఎన్టీఆర్ తో నటించే అవకాశం ఇవ్వాలని దేవుడ్ని రోజూ ప్రార్థించేదాన్నని చెప్పింది. ఇప్పుడు తన కల నెరవేరుతోందని జాన్వీ కపూర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ రెండుసార్లు చూశానని… ఎనర్జీ, అందం కలయిక ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ ఈ నెల 23న ప్రారంభం కానుంది.