నా మాటలను సీరియస్‌గా తీసుకోండి.. మిచెల్‌ ఒబామాకు జావేద్‌ అక్తర్‌ ట్వీట్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామాకు బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అదేంటంటే.. ‘‘ మేడం.. నేను యువకుడ్ని కాదు. మీ అభిమానిగా సరదా కోసం ఈ ట్వీట్‌ చెయ్యడం లేదు. 77 ఏళ్ల రచయితను నేను. ప్రతి భారతీయుడికీ నా పేరు తెలుసు. నా మాటలను సీరియస్‌గా తీసుకోండి.  కేవలం అమెరికా మాత్రమే కాదు, మీరు వైట్ హౌస్ లో ఉండాలని యావత్‌ ప్రపంచం కోరుకుంటోంది. ఈ బాధ్యతను మీరు విస్మరించకూడదు.’’ అంటూ మిచెల్‌ ఒబామాకు జావేద్ అక్తర్ ట్వీట్ చేశారు.

మిచెల్‌ ఒబామా త్వరలో తాను వెళ్లబోయే ‘ది లైట్‌ వి క్యారీ’ అనే వినోద యాత్ర గురించి ట్వీట్‌ చేశారు. వాషింగ్టన్‌ డీసీ, ఫిలడేల్పియా, అట్లాంటా, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజల్స్‌ నగరాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగమయ్యేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ మిచెల్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన జావేద్‌ అక్తర్‌ ఆమెను శ్వేతసౌధానికి మళ్లీ వెళ్లాల్సిందిగా కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news