ప్రముఖ నటి మరియు అమితాబచ్చన్ భార్య జయ బచ్చన్ పోలీసులను ఆశ్రయించారు. తమ ఇంటి బయట రాత్రిళ్లు బైకర్లు తెగ హల్‌చల్ చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు జూహూ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు అక్కడకు చేరుకునేటప్పటికి ఎవరూ కనిపించలేదని తెలిపారు. అయితే చుట్టుపక్కల ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలించి, అందులో బైక్ సంఖ్యను గుర్తించారు.
ఇప్పుడు పోలీసులు రైడర్ కోసం శోధిస్తున్నారు, ఇంకా ఎవరూ పట్టుబడలేదు. అయితే దీనికి సంబంధించి ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఉదయం 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కారణంగా మేము జుహు ప్రాంతాన్ని అడ్డుకుంటున్నాం. ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. కారణం లేకుండా వాహనాల్లో తిరుగుతున్న వ్యక్తులపై మేము చర్యలు తీసుకున్నామన్నారు.