ఐపీఎల్ మినీ వేలం, అంటే కొంతమంది క్రికెటర్లను వదులుకోగా తమ వద్ద మిగిలిన సొమ్ము నుంచి తమ అవసరాల మేరకు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు లభించే అవకాశం. సాధారణంగా పెద్దగా ధరలు నమోదు కావు. కానీ ఈసారి వేలం ధరలు రాకెట్ వేగంతో ఆకాశాన్ని ఉంటాయి. ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లకు కోట్లు కుమ్మరించడంతో రికార్డు ధరలు నమోదు అయ్యాయి.
అయితే, ఐపీఎల్ 2023 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనధ్కట్ 11వసారి వేలంలోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ. 50 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెటర్ లో స్టార్ బౌలర్ అయిన ఉనధకట్ 2018 తర్వాత ఇంత తక్కువ ధరకు అమ్ముడు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. 2018లో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 కోట్లకు కొన్నది.