ఏపీకి హైదరాబాద్ రాజధాని అన్న బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. బొత్స సత్యనారాయణ మళ్లీ హైదరాబాద్ వెళ్లాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ప్రకటించిందని.. మాకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దాన్ని వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందని అనుకుంటున్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై కూడా స్పందించారు జేసీ. ఒకటి కాకుంటే పది రాజధానులు పెట్టుకుంటాము అది మా సీఎం ఇష్టం అంటూ సెటైర్లు వేశారు.
ఉద్యోగ ప్రకటనపై సీఎం కేసీఆర్ ను అభినందించారు. ఒకే సారి ఇన్ని ఉద్యోగాల ప్రకటన ఎప్పడూ లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఉద్యోగ ప్రకటన చేయలేదని అన్నారు. ప్రకటన అయితే చేశారు కానీ.. రిక్రూట్ మెంట్ ఎలా ఉంటుందో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి యువత నుంచి కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉందని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి.