టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్ కల్చర్ తో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని.. పబ్ కల్చర్ కోసమేనా తెలంగాణ సాధించుకుంది అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన అభివృద్ధి ఇదేనా.? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేదని ఆయన విమర్శించారు.
గంజాయి, బెల్టుషాపులు లేని గ్రామాలు లేవని అన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు రూ. 32 ఆప్కారి ఆదాయం ఉంటే ప్రస్తుతం రూ. 80 వేల కోట్లకు ఆదాయం పెరిగిందని అన్నారు. 90 శాతం ప్రమాదాలు మద్యం మత్తులోనే జరిగాయని ఆయన అన్నారు. విచ్చలవిడి మద్యం తో కనీస విలువలు లేకుండా పోయాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.