ఇంటర్ పూర్తి చేసిన వాళ్లకి ఉద్యోగ అవకాశం.. ఈరోజే అప్లై చేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? ఇంటర్ పూర్తి అయి పోయిందా…? అయితే మీకు మంచి న్యూస్. ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే…! అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అసలు విషయం లోకి వచ్చేస్తే… ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 200 ఫీల్డ్ సూపర్ వైజర్లు పోస్టులని భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉంటే అప్లై చేసేయొచ్చు. 18 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక వేతనంపై అయితే… నెలకు రూ.10,000, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరి తేదీ. http://www.masmcs.com/ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలంటే ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15A, 3-4-757/22, APHB బిల్డింగ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు , బర్కత్ పుర కి పంపాలి.

Read more RELATED
Recommended to you

Latest news