విజయవాడలో ఓటేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ”బయటకు రండి.. ఓటేయండి, అందరూ ఓటేసి.. విజయవాడని రక్షించుకుందాం” అని అన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యత నిర్వర్తించాలని, చిన్నపాటి సమస్యలున్నా.. ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. ఫిర్యాదులకు అధికారులు స్పందిస్తున్నారని కానీ కొన్నిచోట్ల వైసీపీ అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఓటేస్తే విజయవాడ బాగుపడుతుందని ఆయన అన్నారు. పోలింగ్ స్టేషన్ల విషయంలో గందరగోళం ఉందని అన్నారు.
ఇక ఓటు హక్కు వినియోగించుకున్న కేశినేని శ్వేత మాట్లాడుతూ డివిజన్లను రీ-డ్రాయింగ్ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని, ఒకే ఇంటిలో ఉన్న వారి ఓట్లను వేర్వేరు పోలింగ్ స్టేషన్లల్లో వేశారని అన్నారు. మా ఇంట్లో నా ఓటు ఒక చోట, నాన్నది, అమ్మది వేర్వేరు చోట్ల ఉన్నాయని ఆమె అన్నారు. మా అభ్యర్ధులను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీద మీదకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విజయవాడలో టీడీపీ గెలుపు అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.