గుడ్ న్యూస్: పరీక్ష లేకుండానే ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాలు..!

-

మీరు భారత సైన్యంలో చేరాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ లో చేరాలనుకునే యువతకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. భారత సైన్యం పురుష, మహిళా అభ్యర్థుల కోసం NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఉన్న అధికారుల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానంగా ఉండాలి.

అలానే వారు NCC , సీనియర్ డివిజన్ లేదా వింగ్‌లో కనీసం రెండు లేదా మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 55 ఖాళీలను నియమించనున్నారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 15 జూలై 2021.

ఇక ఖాళీల వివరాలలోకి వెళితే.. NCC మేల్ – 50 పోస్టులు, NCC ఫీమేల్ – 5 పోస్టులు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ ఉంటుంది, తరువాత ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేయబడే అభ్యర్థులు ఎంపిక కేంద్రంలో ఎస్‌ఎస్‌బి రౌండ్ కి అర్హులు.

ఇలా రెండు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఉంచనున్నారు. స్టేజ్ I ని క్లియర్ చేసిన వారు స్టేజ్ II కి వెళతారు. ఇలా ఎంపిక విధానం ఉంటుంది. అప్లై చేసుకోవాడ్నైకి అధికారిక వెబ్‌సైట్, joinindianarmy.nic.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news