అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయం మరింత హీటెక్కింది. కరోనా వైరస్ అంశమే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు ఏ సర్వే చూసిన జోబిడైన్‌కే అనుకూలంగా ఉన్నాయా ? జో బిడెన్ గెలుపు ఖాయమేనా? ఓటర్లు ఎటు మొగ్గుచూపుతున్నారు? అసలు జోబిడెన్‌కు కలిసొచ్చే అంశాలేంటి?
కరోనా అంశమే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారింది. కరోనా విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ అమెరికా ప్రజలు ట్రంప్ పై ఆగ్రహంగా ఉన్నారు. కరోనా పాజిటివ్‌గా ఉన్న సమయంలో ట్రంప్‌కు ప్రజల నుంచి కొంత సానుభూతి లభించినా…. మళ్లీ వైరస్ తగ్గక ముందే మళ్లీ ఎన్నికల ప్రచారంకు రావడం . మాస్క్ తీసి ప్రజల్లో తిరుగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..ఇదే ఇప్పుడు జో బిడెన్ కి ప్లస్ అయ్యేలా ఉంది.
సీఎన్ఎన్ సర్వేలో ట్రంప్ కన్నా జో బిడెన్ 11 శాతం ఎక్కువ ప్రజల మద్దతు ఉన్నట్లుగా తేలింది. కరోనా విషయంలో ట్రంప్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని, ఇలాంటి అధ్యక్షుడు మళ్లీ రావడం వలన ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. కరోనా విషయంలో ట్రంప్‌ది బాధ్యతారాహిత్యమని 63 శాతం మంది చెప్పగా.. తన చుట్టూ ఉండేవారి భద్రత, వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని విస్మరించారని పలువురు అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద కరోనా అంశమై అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయనుంది. ట్రంప్ నిర్లక్షమే జోబైడన్‌కు కలిసివచ్చింది.