సూపర్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఆలియా భట్ స్థానంలో ఫిక్స్

-

ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో కానీ రష్మికా మందన్నను లక్ వదలడం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటు తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీ హీరోయిన్ మారింది. వరసగా హిట్లమీద హిట్లు కొడుతూ.. స్టార్ హీరోలకు ఛాయిస్ గా మారింది. ఇటీవల పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లోకి వెళ్లింది. పుష్ప సినిమాతో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయింది. 

తాజాగా మరో సూపర్ ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ముందుగా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ను అనుకున్నప్పటికీ… కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం అలియా భట్ స్థానంలోకి రష్మిక వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘ జనతా గ్యారేజ్’ భారీ విజయం సాధించింది. ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news