జిన్నా సర్కిల్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చల విడిగా జరుగుతుందని.. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మేం దొంగల్ని పట్టుకుంటే దొంగల ప్రభుత్వం మాపై కేసు పెట్టిందని.. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
ప్రజలు తినడానికి ఉపయోగపడని బియ్యం ఇస్తూ బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహిస్తున్నారని.. కొంత మంది మంత్రులు క్రైస్తవ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారన్నారు. ఒక మహిళా మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై కేసులు పెట్టించి ఉద్యోగం నుండి తొలగించారని….ప్రకాశం జిల్లాలో ప్రతి కొండపై శిలువ లు పెడుతున్నారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు.
గుంటూరులో జిన్నా సర్కిల్ పేరుని తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలి….సీఎం వచ్చినప్పుడల్లా షాపులు మూసివేయడం కరెక్ట్ కాదన్నారు. అధికారంలో లేనప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవాడు…ఇప్పుడు లోపల ఉంటున్నాడు…సీఎం పర్యటనల కోసం బలవంతంగా కార్లు లాక్కోవడం సరికాదని ఆగ్రహించారు.