మణిపూర్‌ ఘటనపై కేఏ పాల్‌ నిరసన..

-

నేడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్, పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఆందోళన చెప్పట్టారు. సినీ నటుడు రాజా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మణిపూర్ ఘటనలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలుసు అని మండిపడ్డారు కేఏ పాల్. ఈ ఘటనలు రెండు మతాల మధ్య జరిగినవి కాదన్నారు. మణిపూర్ లో జరుగుతున్న ఘటనలు రెండు ట్రైబల్స్ వర్గాల మధ్య జరుగుతున్న గొడవలు కాదని తెలిపారు ఆయన.

K.A. Paul Promises US Visas To 59 Unemployed From T'gana's Munugode

మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపూర్ ముఖ్యమంత్రి అయిన బీరెన్ సింగ్ తో పాటు ప్రధాని మోదీ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు కేఏ పాల్. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాన్ పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు కేఏ పాల్. బీజేపీకి, టీడీపీకి పవన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని అడిగారు. తెలంగాణలో బీజేపీని గెలనివ్వమన్నారు పాల్. ‘‘మోడీకి హటావో దేష్ కి బచావో’’ అంటూ వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news