చిరంజీవికి ద‌ర్శ‌కేంద్రుడి శుభాకాంక్ష‌లు

-

ఆగస్ట్ 22. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగరోజు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘బాబాయ్.. మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు… ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ‘చిరంజీవి’ లా ప్రకాశించాలని, ఆ శ్రీవారి ఆశీస్సులతో ఇంకెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను..’’ అని రాఘ‌వేంద్ర‌రావు తన ట్వీట్ చేశారు. అంతేగాకుండా.. చిరంజీవి కోసం ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news