వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. తాజాగా కూరగాయలు తీసుకోని ఇంటికి వెళ్లిన ఓ మహిళకు ఓ పచ్చిమిర్చి వినాయకుడి రూపంలో కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె ఆ విఘ్నేశ్వరుడే తమ ఇంటికి వచ్చాడని మురిసిపోయింది. ‘మనం స్వామి దగ్గరకు వెళ్లలేకపోతే, స్వామే మన దగ్గరకు వస్తారు. ఒక్కోసారి మిర్చి రూపంలో కూడా”అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.
When you can't go to Bappa, he comes home.. sometimes in the guise of a chilly! 😃 🙏 #Ganpati #GaneshChaturthi pic.twitter.com/F3P5i3D1Dx
— Anubha 🌿 (@teatattler) August 21, 2020
ఆ మిర్చి చూడ్డానికి వినాయకుడి తల, తొండంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాగా ప్రతీ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే చవితి వేడుకలు ఈ సారి కరోనా కారణంగా అంతంత మంత్రంగానే జరుగుతున్నాయి. ప్రతీ సంవత్సరం గల్లీ గల్లీ లో కొలువుదీరే గణనాధుడు ఈ సారి కొన్ని చోట్లకి మాత్రమే పరిమితం కానున్నాడు.