బిజెపి తరపున పోటీ చేసే అభ్యర్థి ప్రెసిడెంట్ అవుతారని.. శరద్ పవార్, గులాం నబిల పేర్లను ప్రపోజ్ చేశారని కేఏ పాల్ పేర్కొన్నారు. ఇద్దరూ విముఖత చూపారు..నేను అభ్యర్థిని కాదు.. విపక్షాలు .. ఎవడికి వారే యమునా తీరేలా ఉన్నారని తెలిపారు. ఒక మంచి న్యూట్రల్ కాండిడేట్ ను ప్రపోజ్ చేశానన్నారు కే ఏ పాల్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. మోడీ, అమిత్ షా లకు స్పష్టంగా చెప్పానని వెల్లడించారు.
ఎకనామిక్ సమ్మిట్ పెట్టాలని కోరానని.. ఈ వారంలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారన్నారు. మోడీ, అమిత్ షా లు అహ్మదాబాద్ లో సమ్మిట్ పెట్టమని అడుగుతున్నారు…నేను హైదరాబాద్ లో అయితేనే సమ్మిట్ అని చెప్పానని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరారు.. మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు.. ప్రతిపక్షం యూనీటిగా లేదని విమర్శించారు. సేవ్ సెక్యులర్ ఇండియా నుంచి మా మద్దతు కోరుతున్నారు… కేసీఆర్ ను తెలంగాణ లో తిరస్కరించారని..కేసీఆర్ 8 ఏళ్లుగా ఫెయిల్ అయ్యారన్నారు. బిజెపి నాయకులు నార్త్ ఈస్ట్ లో పర్యటించి పోటీ చేయమనటున్నారని వెల్లడించారు.