Kajal Agarwal : చంద్రముఖిగా కాజల్ ?

-

తమిళ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు చంద్రముఖి-2. అగ్రచిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ గా సుపరిచితుడైన రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితం రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న అనంతరం మైసూరు షూటింగ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు రాఘవ లారెన్స్.

ఇది ఇలా ఉండగా, పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చంద్రముఖి-2 సినిమాలో కాజల్ అగర్వాల్ చంద్రముఖి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తోలుత ఇతర నటీమణులను తీసుకుందామనుకున్న మూవీ యూనిట్, ఇటీవల కాజల్ కు కథ చెప్పిందట. దానికి చందమామ ఓకే చెప్పినట్లు టాక్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. కాగా చంద్రముఖి ఫస్ట్ పార్ట్ లో జ్యోతిక చంద్రముఖి పాత్రలో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news