టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గెస్ట్గా సూపర్ క్వీన్ 2 ప్రారంభోత్సవం, ఈ ఆదివారం మీ జీ తెలుగులో!

-

హైదరాబాద్, 04 ఏప్రిల్ 2023: తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఎప్పుడూ ముందుండే ఛానల్ జీ తెలుగు. మంచి కథలు, కాన్సెప్ట్లతో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలతో అభిమానులను అలరిస్తోంది. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా.. జీవితంలో విజేతలై నిలిచి ప్రేక్షకుల మనసులలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న పదిమంది నటీమణులతో ‘సూపర్‌ క్వీన్‌’ అనే రియాలిటీ షోను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో విజయవంతమైన ఈ రియాలిటీ షో రెండో సీజన్తో మరోసారి మీ ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు వినోదం పంచుతూనే టైటిల్ కోసం పదిమంది మహిళామణుల మధ్య జరిగే పోరాటమే సూపర్ క్వీన్ 2. ఏప్రిల్ 09న మధ్యాహ్నం 12 గంటలకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుంది. సూపర్ క్వీన్ 2, ఏప్రిల్ 16 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, మీ జీ తెలుగులో!

ఈ సీజన్‌లో విద్యుల్లేఖ రామన్, లిఖిత మూర్తి, మౌనిక యాదవ్, ఎస్తర్, ప్రియాంక, సుస్మిత, పవిత్ర, ప్రశాంతి, సుహాసిని వంటి బుల్లితెర నటీమణులతోపాటు తన డ్యాన్స్తో అభిమానులను సంపాదించుకున్న కండక్టర్ ఝాన్సీ కిరీటం కోసం పోటీపడనుంది. ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వం గల ఈ పదిమంది మహిళామణులు తామేంటో నిరూపించుకునేందుకు సిద్దమయ్యారు. ఇక, ఈ కార్యక్రమానికి ఎవర్గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రదీప్ తన టైమింగ్, పంచులతో షో ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచడం ఖాయం.

జీ తెలుగు సూపర్ క్వీన్ 2 రియాలిటీ షో మాత్రమే కాదు, మహిళా శక్తికి జరిగే పట్టాభిషేకం. వినోదభరితమైన టాస్క్లు, స్ఫూర్తివంతమైన ప్రదర్శనలతో షో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుంది. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని విజయపథంలో నిలిచిన పదిమంది మహిళల ప్రయాణం మరెందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. సూపర్ క్వీన్ 2 టైటిల్ కోసం జరిగే సమరాన్ని ఆరంభించేందుకు టాలీవుడ్ సూపర్ క్వీన్ కాజల్ అగర్వాల్ అతిథిగా రానున్నారు. పదిహేనేళ్లుగా వెండితెరపై తిరుగులేని హీరోయిన్గా రాణిస్తోన్న కాజల్ ప్రస్తుతం అమ్మగానూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. విజయవంతమైన మహిళగానే కాకుండా ఇల్లాలిగా, అమ్మగా తన అనుభవాలనూ పంచుకున్నారు. సూపర్ క్వీన్ సమరంలో పాల్గొనే పోటీదారులకు శుభాకాంక్షలు తెలిపి అందరూ తమ ప్రతిభను నిరూపించుకోవడంలో ఎక్కడా రాజీ పడొద్దని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ ప్రపంచంలో ప్రతి మహిళ ఒక సూపర్ క్వీన్. 10 మంది మహిళలు అందం, తెలివితేటలతో పోటీపడే షో ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ క్వీన్ 2 ఒక ప్రత్యేకమైన వేదిక. మహిళలకు వారి నైపుణ్యాలు, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇదో చక్కని అవకాశం అందిస్తుంది. ఈ షో చూసేవారిలోనూ స్ఫూర్తి నింపుతుంది. ఈ వేడుకలో భాగమవడం నేను గౌరవంగా భావిస్తున్నాను. పోటీదారుల మధ్య జరిగే పోటీని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు. కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభమైన సూపర్ క్వీన్ 2 కార్యక్రమం జీ తెలుగు ప్రేక్షకులకు వినూత్నమైన రీతిలో వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇక, టైటిల్ పోరులో ఈ పదిమంది శివంగుల మధ్య జరిగే సమరాన్ని చూసేందుకు మీరూ సిద్ధం కండి.

పదిమంది మహిళామణుల మధ్య సాగే ఆసక్తికర సమరం ఏప్రిల్ 09 నుంచి ప్రారంభం, ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, మీ జీ తెలుగులో!

Read more RELATED
Recommended to you

Latest news